Social 1080×1350 • Multi-page
03-09-2026 BREAKING NEWS 08:07 PM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు. – శ్రీకృష్ణుడి నుంచి ధైర్యం, ధర్మపోరాట స్ఫూర్తిని నేర్చుకోవాలి. – ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు. – శ్రీకృష్ణుడి నుంచి ధైర్యం, ధర్మపోరాట స్ఫూర్తిని నేర్చుకోవాలి. – ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి
IMG-20260903-WA0045

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కష్టాల్లో ఉన్నవారికి కొండంత భరోసానిచ్చి, భగవద్గీత రూపంలో మానవాళికి దిశానిర్దేశం చేసిన శ్రీకృష్ణుడి దివ్య జన్మదినమే శ్రీకృష్ణాష్టమి అని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.
హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో గురువారం ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. ఉట్టి వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తూ విద్యార్థులు సందడి చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చదువులో, ఆటల్లో ఎలాంటి కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే తత్వాన్ని శ్రీకృష్ణుడి జీవితం నుంచి విద్యార్థులు నేర్చుకోవాలని సూచించారు. శ్రీకృష్ణాష్టమికి విశిష్టమైన చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందన్నారు. శ్రీకృష్ణుడి జీవితం తల్లి ప్రేమ, ఆప్యాయతలకు ప్రతిబింబంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
శ్రీకృష్ణుడి బాల్య లీలలు, చిలిపి చేష్టలు చిన్నారుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు, జీవితంలోని విలువలను తెలియజేస్తాయని అన్నారు. శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం, ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ధర్మం వైపు నిలిచి, అధర్మాన్ని ఎదుర్కొనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు.
వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణుడి లీలలను తెలిపే నృత్య రూపకాలు, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


&& లోకల్ యాడ్స్ &&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: టెట్రా హెడ్రన్ కిండర్ గార్టెన్ ప్లే స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!