విజ్ఞాన్ పాఠశాలలో ఆకట్టుకున్న ముందస్తు కృష్ణాష్టమి ఉత్సవాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : స్థానిక హుజురాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో చాలా ఉత్సాహంగా ఘనంగా కృష్ణాష్టమి జయంతి జరుపుకోవడం జరిగింది. పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా కృష్ణుని మరియు గోపికమ్మ వేషధారణలో చాలా సంతోషంగా రావడం జరిగింది.

ఈ సందర్బంగా పాఠశాల కరస్పండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ కృష్ణుడు ఎంతో గొప్పవాడు అని, శ్రీకృష్ణ జన్మాష్టమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన జీవితాలను విజయ వైపు నడిపించే గొప్ప ప్రేరణాత్మక సందేశం అందించిన వేడుక. భగవద్గీత రూపంలో కృష్ణుడు అందించిన జీవన సూత్రాలు మనకు ఎంతో ఎంతగానో ఉపయోగపడతాయి. ఫలితం గురించి ఆలోచించకూడదు. శ్రమించు దానంతట అదే వస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన అత్యంత గొప్ప సూత్రం కర్మన్యవాదికారస్తే మా ఫలేశు కథాచనా అని, మనం చాలాసార్లు పరీక్ష రిజల్ట్ లేదా ఉద్యోగం వస్తుందో లేదో అని భయపడి మనం చదవడం లేదా పనిచేయడం మానేస్తాం. శ్రమ నీదైతే విజయం దానంతట అదే వస్తుంది. సమస్యలకు భయపడకూడదు కృష్ణుడు తన జీవితంలో ఏనాడు ఏడవలేదు ప్రతి కష్టాన్ని నవ్వుతూ ఒక ఆటలాగా ఎదుర్కొన్నాడు మన జీవితంలో కూడా సమస్యలను వచ్చినప్పుడు భయపడి వెనుకడుగు వేయకూడదు సమస్యలను చూసి నవ్వడం నేర్చుకోవాలి ధైర్యంగా పోరాడితే ఎంతటి కష్టాన్నయినా దాటవచ్చు నీ నైపుణ్యాన్ని సమాజం కోసం వాడు మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఆయుధం పట్టలేదు కానీ తన మేధస్సుతో సరైన వ్యూహాలతో అధర్మాన్ని అణిచివేసి ధర్మాన్ని గెలిచాడు అని తెలిపారు. అలాగే కృష్ణాష్టమి రోజున కేవలం పూజలు చేయడము అట్లు మిఠాయిలతో కాదు ఆయన చూపిన ధర్మ మార్గంలో నడవాలని నిర్ణయించుకుందామని పిల్లలను ప్రేరేపిస్తూ ఉత్తేజపరుస్తూ మాట్లాడడం జరిగింది. పాఠశాల విద్యార్థులు కూడా ఉపన్యాసాలతో, నృత్యాలతో చాలా అలరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దాసరి తిరుపతి యాదవ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని చాలా సంతోషంగా ముందస్తు కృష్ణాష్టమి జరుపుకున్నారు.
.———————————————–
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: టెట్రా హెడ్రన్ కిండర్ గార్టెన్ ప్లే స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

