Social 1080×1350 • Multi-page
03-09-2026 BREAKING NEWS 09:29 PM
swarnodayam.com
Telugu Daily News

శస్త్ర పబ్లిక్ స్కూల్‌లో కోలహాలముగా ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

శస్త్ర పబ్లిక్ స్కూల్‌లో కోలహాలముగా ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు
IMG-20260903-WA0063

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లిక్ స్కూల్‌లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అలరించారు.

చిన్నారుల కృష్ణుడి వేషధారణ, గోపికల వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ఆవరణలో శ్రీకృష్ణుడి జీవిత విశేషాలను తెలియజేస్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను సందడిగా మార్చారు.

పాఠశాల కరస్పాండెంట్ వేణుమాధవ్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. శ్రీకృష్ణుడి బోధనలు, ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తి పెంపొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ముంజాల సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.


## లోకల్ యాడ్స్ ##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: టెట్రా హెడ్రన్ కిండర్ గార్టెన్ ప్లే స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!