గురు సంత్ రవిదాస్ చిత్రపటంపై నల్ల రంగు పూయడం కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టే : – బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని, సంత్ రవిదాస్ గారి చిత్రపటంపై నల్లరంగు పూయడాన్ని ఖండిస్తూ గురువారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎర్ర శ్రీధర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ భేదాభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యక్తం చేయాలే తప్ప, రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి దాడులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.
గురు సంత్ రవిదాస్ గారి చిత్రపటంపై నల్లరంగు పూయడం అత్యంత హేయమైన చర్య అని నాయకులు అన్నారు. మహనీయుల చిత్రపటాలపై నల్లరంగు పూయడం కోట్లాది ప్రజల మనోభావాలను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందనే అహంకారంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను సహించేది లేదని నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు జిల్లాకౌన్సిల్ మెంబర్ రావుల వేణు సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్ సబ్బని రమేష్ టౌన్ జనరల్ సెక్రెటరీలు తిప్పబత్తిని రాజు గంటసంపత్, సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, నల్ల సుమన్, నరాల రాజశేఖర్, యాంసాని శశిధర్, పట్టణ ఉపాధ్యక్షులు యాళ్ల సంజీవ రెడ్డి, వొడ్నాల విజయ్, ఇల్లందుల ప్రణీత్, ఎస్సి మోర్చా అధ్యక్షులు ఎర్రశ్రీధర్, ఎస్టీ మోర్చాఅధ్యక్షులు కుతాడి కుమారస్వామి, ఓబీసీ మోర్చాఅధ్యక్షులు కొలిపాక వెంకటేష్, బీజేవైఎం అధ్యక్షులు మోటపోతుల రాకేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు మాసాడి శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్సులు కొడిమ్యాల పవన్, గుర్రం సంతోష్, బొడిగె రాధ, కొలుగూరి అనిల్, పట్టణ కోశాధికారి క్యాస వెంకటేష్, బూత్అధ్యక్షులు అపరాధ రమణ, యాటా రాజేష్, నాయకులు బోరగాల సారయ్య, పడారి కొమరయ్య, డోరీ ఐలయ్య, తూర్పాటి శంకర్ ,తూర్పాటి రామ్ చంద్రం, ములుగురి రాజు, దాసరి వీరన్న, మొలుగూరి నగేష్, ఎస్సి మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: టెట్రా హెడ్రన్ కిండర్ గార్టెన్ ప్లే స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

