హుజూరాబాద్‌లోని సాయిబాబా ఆలయంలో శ్రావణ గురువారం ప్రత్యేక పూజలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, సెప్టెంబర్ 4: శ్రావణ మాస గురువారాన్ని పురస్కరించుకుని హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం భక్తిపారవశ్యంతో విల్లివిరిసిల్లింది.ఆలయ ప్రధాన పూజారి వరుణ్ ఉదయం నుంచే ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, కాకడ హారతి, సహస్ర నామార్చనలు వైభవంగా నిర్వహించారు.


పవిత్రమైన శ్రావణ గురువారం కావడంతో పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాబావారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించేందుకు స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ అంపటి సదానందం, సభ్యులు ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు.మహిళా విభాగం ప్రత్యేక భజనలు చేయడం ఆకట్టుకుంది. మధ్యాహ్నం వేళ మహా హారతి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

