నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్ బాబు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్స్ లో ఓ వివాహ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశీర్వదించారు. వారి కుటుంబం మంచి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి వెంట హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని, తాటిపెళ్లి రాజన్న, కిరణ్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు..
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: టెట్రా హెడ్రన్ కిండర్ గార్టెన్ ప్లే స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

