అల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

—ఉపాధ్యాయులే ఉత్తమ సమాజ నిర్మాతలు
– అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి అత్యంత విశిష్టమైనదని, ఉపాధ్యాయుల ద్వారానే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి అన్నారు. హుజురాబాద్‌లోని అల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు


. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గురువు కేవలం పాఠాలు బోధించేవారు మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే శిల్పి అని అన్నారు. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును అందిస్తూ, ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే గురువుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నిస్వార్థ సేవలకు ప్రతీకగా నిలిచారని, ఆయన జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్‌ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



