Social 1080×1350 • Multi-page
06-09-2026 BREAKING NEWS 07:38 PM
swarnodayam.com
Telugu Daily News

రసమయి నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నాలుక కోస్తాం తస్మాత్ జాగ్రత్త.. – కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి టేకుల శ్రావణ్ హెచ్చరిక

రసమయి నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నాలుక కోస్తాం తస్మాత్ జాగ్రత్త.. – కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి టేకుల శ్రావణ్ హెచ్చరిక
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్.కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి టేకుల శ్రావణ్ హెచ్చరించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ… మానకొండూర్ మాజీ శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ ఒక చదువుకున్న అజ్ఞాని అని చదువుకు తగ్గ సంస్కారం లేని సంస్కార హీనుడని మండిపడ్డారు. మచ్చలేని కవ్వంపల్లి కుటుంబం పై అర్థరహిత విమర్శలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కవ్వంపల్లి తల్లిదండ్రులు మున్సిపాలిటీలో పనిచేసి పోషించారని వారి పోషణ పట్ల కూడా పోషించే విధానాన్ని కించపరిచి దళితుల మరియు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికులను సైతం కించపరిచే విధంగా మాట్లాడిన నీకు సరైన బుద్ది చెప్తామని అన్నారు. ఉద్యమ సమయంలో గోషి, గొంగళితో వచ్చి మానకొండూర్ టికెట్ కోసం కెసిఆర్ కుటుంబాన్ని బెదిరించి వారికి వ్యతిరేకంగా పాటలు పాడతానని సావు డప్పు కొడతానని బెదిరింపులకు గురి చేసింది నిజం కాదా? మొదటి నుండి నీ బ్రతుకంత బెదిరిపులేనని, నువ్వు సాంస్కృతిక సారథిగా ఉన్న సమయంలో ఎంతో మంది ఉద్యమ కారుల పొట్టకోట్టావని నిజమైన కళాకారులను మోసంచేసి, నకిలీ ఉద్యమ కారులకు ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర నీది కాదా? అలాంటి చరిత్ర కలిగిన నువ్వు కవ్వంపల్లి కుటుంబం గురుంచి అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కవ్వంపల్లి కుటుంబ సభ్యుల కాలిగొటితో సమానం నువ్వు , ఉద్యోగాల పేరిట ఎంతో మంది అమాయక అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఒక మూర్ఖుడివి నువ్వా కవ్వంపల్లి విమర్శించితే ఖబర్దార్ బిడ్డ ఇంకోసారి కవ్వంపల్లి గురించి అడ్డగోలుగా విమర్శిస్తే నాలుక చిరుతామని మూర్ఖుడిలా ప్రవర్తిస్తే అదే రీతిలో ఘాటైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో చెప్పులు గతిలేని నీకు ఫామ్ హౌస్ లు, కోళ్ల ఫారాలు, ఎకరాల కొద్ది భూములు ఎలా వచ్చాయో తెలపాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.


@@ లోకల్ యాడ్స్ @@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ మండ సతీష్ గౌడ్ ఉప సర్పంచ్ కందుగుల, ఉప సర్పంచ్ ల ఫోరం మండల గౌరవ అధ్యక్షుడు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!