Social 1080×1350 • Multi-page
07-09-2026 BREAKING NEWS 05:24 PM
swarnodayam.com
Telugu Daily News

ఎస్సారెస్పీ డీబిఏం 16 ఉపకాల్వలో పెరిగిన చెట్లను, ముళ్లపోదలను తొలగించాలి.. -12వ వార్డు కౌన్సిలర్ రవీందర్ రావు

ఎస్సారెస్పీ డీబిఏం 16 ఉపకాల్వలో పెరిగిన చెట్లను, ముళ్లపోదలను తొలగించాలి.. -12వ వార్డు కౌన్సిలర్ రవీందర్ రావు
IMG-20260907-WA0102

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ​హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలోని ఎస్సార్ ఎస్పి ఉప కాకతీయ కాలువ16లో విపరీతంగా పెరిగిన చెట్లను సోమవారం స్థానిక మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాలువలో పచ్చదనంతో ఉపయోగపడని చెట్లు విపరీతంగా పెరిగిపోయి అసలు కాకతీయ కాలువ ఉన్న ఆనవాళ్లే కనిపించకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చెట్లు, ముళ్ళ పొదలు ఏపుగా పెరిగి కాలువ గట్లు కోరుకుపోతున్నాయి అన్నారు. ఇలాగే నిర్లక్ష్యంగా దిలేస్తే కాలువ పూడికకు గురై పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే స్పందించి కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలు, ఇతర ఉపయోగపడని చెట్లను తొలగించి కాకతీయ ఉప కాలువను రక్షించాలని సంబంధిత నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ(ఎస్సారెస్పీ) అధికారులను రవీందర్ రావు డిమాండ్ చేశారు.


**లోకల్ యాడ్స్**

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీమతి శ్రీ సొల్లు సునీత – సొల్లు బాబు 5వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!