Social 1080×1350 • Multi-page
07-09-2026 BREAKING NEWS 09:08 PM
swarnodayam.com
Telugu Daily News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ సబ్ జైలర్… – జైలర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ సబ్ జైలర్… – జైలర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.
1006720591

​మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసి, లంచం తీసుకుంటూ హుజూరాబాద్ సబ్ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
​కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ (46)… జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుని మామగారికి మెరుగైన వసతులు కల్పించడం, ములాఖత్‌లకు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూసేందుకు రూ.10,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

​ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సుమారు 5:45 గంటల సమయంలో, ఇండియన్ ఆయిల్ సబ్ జైల్ పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ (30) ద్వారా డిప్యూటీ జైలర్ దేవేందర్ రూ.10,000 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పెట్రోల్ బంక్ ఆపరేటర్ వద్ద నుంచి రసాయన పరీక్షల అనంతరం నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డిప్యూటీ జైలర్ దేవేందర్ (ఏ-1), బంక్ ఆపరేటర్ హరీశ్ (ఏ-2)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు.


## లోకల్ యాడ్స్ ##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీమతి శ్రీ సొల్లు సునీత – సొల్లు బాబు 5వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!