ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. – ప్రజావాణిలో ఫిర్యాదు, రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన బిఆర్ఎస్ నేతలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను పూర్తిచేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుతూ హుజురాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడమే కాకుండా అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసనను తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎంపీడీవో తూర్పాటి సునీతకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు.

అనంతరం వారు మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారం దక్కించుకుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మాటలను పక్కనపెట్టి తనకు నచ్చిన రీతిలో పరిపాలన చేస్తుందని అన్నారు. ప్రజలకు సంబంధించిన అవసరాలను పనులను గురించి ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం కేసులు పెడుతూ ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు. అయినప్పటికీ ప్రజల బాగోగుల కోసం వేటికీ భయపడకుండా బి ఆర్ ఎస్ అధినాయకత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపుతున్న గులాబీ నేతలపై కక్షలు పెంచుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లేని పక్షంలో ప్రజల కోసం పోరాటాలు గులాబీ సైనికులు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు వర్ధినేని రవీందర్రావు, గందె శ్రీనివాస్, కేసిరెడ్డి లావణ్య, బండ సింధుజ, సర్పంచి కట్కూరు మల్లారెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మారేపల్లి సుశీల, కోయడ కమలాకర్, కోయడ శ్రీదేవి, జి పావని గౌడ్ , నాయకులు ఇరుమల సురేందర్ రెడ్డి, ప్రతాప కృష్ణ, పంజాల శ్రీధర్, దాసి కుమారస్వామి, శ్రీనివాస్, సదానందం, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహిస్తున్న బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధూలు ..
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీమతి శ్రీ సొల్లు సునీత – సొల్లు బాబు 5వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.

