కొండంగల్ లో కాదు హుజురాబాద్ లో రాజీనామా చేసి..దమ్ముంటే గెలువు. – కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?..-కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్.

–హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితానికి పాడే కట్టే రోజు ముందుంది..
–స్పీకర్ పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.
-మహిళలంటే గౌరవమున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ..
- దళితులంటే బీఆర్ఎస్,కౌశిక్ రెడ్డి కి చిన్న చూపు.
- 50 కోట్లు కాదు ఒక్కరూపాయి కూడా దళిత బంధు అకౌంట్ లో కెళ్ళి నిధులు వెనక్కి పోలేదు..
- కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరిన ప్రణవ్.స్వీకరణకు సిద్ధమా?
- అసెంబ్లీలో స్పీకర్ కన్నీరు పెట్టడం బాధ కలిగించింది.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : అసెంబ్లీ అంటే దేవాలయమని అలాంటి దేవాలయం ముందు బిఆర్ఎస్ నాయకులు చేసిన ప్రవర్తన సిగ్గుచేటని, దళితులంటే బీఆర్ఎస్ పార్టీకి, కౌశిక్ రెడ్డికి ప్రేమ లేదని, ఎన్నికల ముందు వారి ఓట్ల కోసం కపటప్రేమ చూపెడుతూ వారి సంక్షేమాన్ని అడ్డుకున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. దళిత స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో తాతా మధు వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసి, ఆయన దిష్టి బొమ్మ దగ్ధంచేశారు. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యల్లో బిఆర్ఎస్ నాయకులు, సీనియర్లు అని చెప్పుకునే నాయకులు, మంత్రులుగా చేసిన వారు ఈ చర్యను ఏ విధంగా సమర్థించుకుంటారో వారి విజ్ఞతకు వదిలేస్తున్నామని అన్నారు. మహిళల పట్ల గౌరవం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయి కౌశిక్ రెడ్డిది కాదని, ఇప్పటికే ఆయన ప్రవర్తన చూసి హుజురాబాద్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


దళిత బంధు ఆపి, వారి కళ్ళల్లో కన్నీళ్ళు నింపిన వ్యక్తి కౌశిక్ రెడ్డి..
దళిత బంధు పథకం లబ్ధిదారులకు అందకుండా అడ్డుకున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి అని, రెండేళ్లు ఎమ్మెల్సీగా ఉండి, వారికి నిధులు ఇవ్వకుండా ఎన్నికల్లో తమకు ఓటు వేస్తేనే పథకం అందుతుందని ఓట్ల కోసం వారిని వాడుకున్నారని, దళిత బంధు పథకం ఆపి దళితుల కళ్ళల్లో కన్నీళ్ళు నింపిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని ప్రణవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రులను కోరితే మా కోరిక మేరకు నిధుల విడుదలకు ఫ్రీజింగ్ ఎత్తి వేశామని మిగతావి కూడా పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేస్తామని దళితులకు భరోసా కల్పించారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం మాత్రమే చూస్తాడు తప్ప నిజంగా ప్రజల బాగోగుల మీద చిత్త శుద్ధి లేదని అన్నారు. లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందవద్దని దళిత బంధు నిధులు వారి అకౌంట్ లేనే ఉన్నాయని, కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

మహిళలంటే గౌరవమున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ..
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించామని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ చుట్టే తమ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని స్పీకర్ ను తిట్టినా వెంటనే ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారని, దళిత స్పీకర్ పై వ్యక్తిగత దూషణకు సంబంధించి బిఆర్ఎస్ ఎలాంటి చర్యలు లేవని ఇదేనా బిఆర్ఎస్ సంస్కారం అని ప్రశ్నించారు. మంత్రి వర్గంలో మంత్రి పదవులు ఇవ్వకుండా వారు ఉంటే ప్రభుత్వం ఏర్పడగానే వారికి మంత్రి పదవులు ఇచ్చి గౌరవించామని అన్నారు.


1000 రోజుల్లో ప్రతి గడపకు సంక్షేమాన్ని అందజేశాం..
గడిచిన 1000 రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి గడపకు సంక్షేమాన్ని అందజేశామని, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఉచిత బస్ అందజేశామనీ, సన్నబియ్యం, నియోజవర్గంలో 18 వేల నూతన రేషన్ కార్డులు, 23 వేల నెంబర్ ఆడిషన్స్ రేషన్ కార్డులు అందజేశామని, ఇందిరమ్మ ఇళ్లతో నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇచ్చామని, 31,158 వేల రైతులకు 243 కోట్లతో 2 లక్షల లోపు రుణమాఫీ చేశామని తెలిపారు. రైతు భరోసా ద్వారా 73 వేల రైతులకు 71 కోట్ల నిధులు హుజురాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9 వేల కోట్లు అందజేశామని అన్నారు. అనేక సంక్షేమ పథాలను ప్రజలకు చెరవేషామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

