Social 1080×1350 • Multi-page
09-09-2026 BREAKING NEWS 02:29 PM
swarnodayam.com
Telugu Daily News

బిల్లులు ఇవ్వరు ముందస్తు అరెస్టుల పేరుతో వేధింపులు.. మాజీ సర్పంచులు అశోక్, రవీందర్ రెడ్డి

బిల్లులు ఇవ్వరు ముందస్తు అరెస్టుల పేరుతో వేధింపులు.. మాజీ సర్పంచులు అశోక్, రవీందర్ రెడ్డి
IMG-20260909-WA0073

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్): అభివృద్ధి పనులు చేసిన బిల్లులు ఇవ్వరు, పైగా ముందస్తు అరెస్టుల పేరుతో వేధింపులకు పాల్పడడం అత్యంత బాధాకరమని
పోలీస్ స్టేషన్లో మాజీ సర్పంచులు వీరమల్ల రవీందర్ రెడ్డి, సుమలత, అశోక్ లు పేర్కొన్నారు. వారు సైదాపూర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంతో పోలీస్ స్టేషన్లో వారు మాట్లాడుతూ ఎలక్షన్లకు ముందు సర్పంచులు ఇబ్బంది పడుతున్నారు వారి బిల్లులు కేసీఆర్ ఇవ్వడం లేదు మా ప్రభుత్వం రాగానే మొత్తం మాజీ సర్పంచ్ల బిల్లులు పెండింగ్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మాజీ సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోగా తరచు ముందస్తు అరెస్టుల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం శోచనీయం అన్నారు. మాకు రావలసిన బిల్లులు చెల్లించమంటే గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు నేనెలా చెల్లిస్తామని మాట్లాడుతున్నారనీ, గత ప్రభుత్వంలో చేసిన పనులను స్మశాన వాటికలను, గ్రామపంచాయతీ భవనాలను ఎందుకు వాడుకుంటున్నారని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు.

ఎంతోమంది మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఈ ప్రభుత్వానికి కొంచమైనా చలనం లేకుండా పోయిందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల ఉసురు తాకి రేవంత్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుందని ఈ సందర్భంగా వారు షాపనార్ధాలు పెట్టారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!