Social 1080×1350 • Multi-page
09-09-2026 BREAKING NEWS 11:26 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్‌లో డీజేలు, బాణసంచాపై నిషేధం: ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ హెచ్చరిక

హుజూరాబాద్‌లో డీజేలు, బాణసంచాపై నిషేధం: ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ హెచ్చరిక
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: వినాయక చవితిని పురస్కరించుకుని విగ్రహాల ఆగమన సమాయంలో డీజేల ఏర్పాటు, అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టమ్స్ మరియు బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధం విధించినట్లు హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరుణాకర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు:

  • శాంతియుత వేడుకలు: గణేష్ విగ్రహాల ఆగమన కార్యక్రమాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, శాంతియుతంగా నిర్వహించుకోవాలి.
  • ముందస్తు అనుమతులు తప్పనిసరి: నిబంధనలకు విరుద్ధంగా, పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి డీజేలు, ఊరేగింపులు, ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
  • శాంతిభద్రతల పరిరక్షణ: వేడుకల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంటప నిర్వహకులు, ప్రజలందరూ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!