Social 1080×1350 • Multi-page
10-09-2026 BREAKING NEWS 07:03 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో ‘దళిత బంధు లబ్ధిదారుల కోసం’ రిలే నిరాహార దీక్ష గోడపత్రిక విడుదల

హుజురాబాద్‌లో ‘దళిత బంధు లబ్ధిదారుల కోసం’ రిలే నిరాహార దీక్ష గోడపత్రిక విడుదల
IMG-20260910-WA0097

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ , సెప్టెంబర్ 10 : హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బండ అశోక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12(శనివారం) నాడు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించబోయే “రిలే నిరాహార దీక్ష” కు సంబంధించిన గోడపత్రికను (పోస్టర్) టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి Dr.ఎనుగు మల్లారెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సన్నాహక సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిలే నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి Dr.ఎనుగు మల్లారెడ్డి

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు Dr.ఎనుగు మల్లారెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకులు సంతోష్ కుమార్ యాదవ్, కోరపల్లి సురేష్, హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన TRS నాయకులు అంబాల హరీష్, కిరణ్ , నరేష్, రితీష్ పాల్గొన్నారు. అదేవిధంగా యువజన విభాగం (యూత్) నాయకులు/కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ:”దళిత బంధు రానీ మరియు రెండో విడత పెండింగ్ లబ్ధిదారులకు అండగా ఉండటానికే ఈ రిలే నిరాహార దీక్షను చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి దళిత సోదరులు ఎవరూ మోసపోవద్దు అన్నారు. వారు మీ జీవితాలతో ఆడుకుంటున్నార
నీ, “ దళిత బంధు అనేది ఎవరిచ్చిన భిక్ష కాదు, అది మన ఆత్మగౌరవం” అన్నారు.
లబ్ధిదారులందరికీ న్యాయం జరిగే వరకు మా తెలంగాణ రక్షణసేన పోరాటం ఆగదు అని, ఈ శనివారం (సెప్టెంబర్ 12) హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరగబోయే ఈ రిలే నిరాహార దీక్షకు దళిత బంధు లబ్ధిదారులు, యువత మరియు ప్రజలందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని” వారు పిలుపునిచ్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!