కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి. – బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల రాక్షస కాండ నుండి తెలంగాణ విముక్తి పొందిన చారిత్రక దినమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం డిమాండ్ చేశారు.

హుజురాబాద్ దర్శిని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సాయిని మల్లేశం మాట్లాడుతూ.. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నాటి నిజాం నవాబు దుర్మార్గపు పాలన కారణంగా తెలంగాణ ప్రాంత ప్రజలు మరో 13 నెలల పాటు బానిసత్వంలోనే మగ్గిపోయారన్నారు. వేలాది మంది అమరవీరుల త్యాగాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్య ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని గుర్తుచేశారు.
గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకుండా తెలంగాణ చరిత్రను విస్మరించాయని మండిపడ్డారు. ముఖ్యంగా నేడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ‘ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో
సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం’ గా కాకుండా ప్రజా పాలన దినోత్సవంగా రాజకీయ డ్రామాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.కర్ణాటక, మహారాష్ట్రల మాదిరిగానే తెలంగాణలోనూ సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం’గా జరపాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తూ వస్తుందని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రతి ఏటా అధికారికంగా ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ వేడుకలను నిర్వహిస్తుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న స్పూర్తితో, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని అధికారిక పండగగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ సెప్టెంబర్ 17న హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ చారిత్రక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సాయిని మల్లేశం పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు కనుమల గణపతి, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, హుజురాబాద్ నియోజకవర్గం మండల అధ్యక్షులు తూర్పాటి రాజు, పారుపల్లి కొండల్ రెడ్డి, కొలగాని రాజు, దొంతరవేణి రమేష్, ర్యాకం శ్రీనివాస్, కౌన్సిలర్లు కొలుగురి సుమలత, శీలం శ్రీనివాస్, సర్పంచులు ఉప్పు మహేష్, కుమార్ బిజెపి సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి, గంగిశెట్టి రాజు, స్థానిక బీజేపీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

