Social 1080×1350 • Multi-page
11-09-2026 BREAKING NEWS 05:55 PM
swarnodayam.com
Telugu Daily News

బిజెపి పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ గా దాసరి వీరన్న

బిజెపి పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ గా దాసరి వీరన్న
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం ఆదేశానుసారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు హుజురాబాద్ పట్టణ సోషల్ మీడియా కన్వీనర్‌గా దాసరి వీరన్నను నియమించారు.

పార్టీ కార్యక్రమాలు, పార్టీ విధానాలు మరియు ప్రజా సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ సంబంధిత సమాచారాన్ని సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యతను అప్పగించడం జరిగిందన్నారు.

ఈ నియామకం ఈ రోజు నుండి అమలులోకి వస్తుందనీ, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసి, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వీరన్న తెలియజేసారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!