శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఘనంగా “వాగ్దేవి ఫియెస్టా – ఫ్రెషర్స్ డే” వేడుకలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్‌లోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో “వాగ్దేవి ఫియెస్టా – ఫ్రెషర్స్ డే” వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న హుజూరాబాద్ టౌన్ సీఐ టి కరుణాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చట్టాల పట్ల అవగాహనతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని అన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, మంచి నడవడిక విజయానికి పునాది అని పేర్కొన్నారు.

కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. విద్యతో పాటు నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

కళాశాల ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలికి, కళాశాల అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

అతిథిగా హాజరైన కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. వేణుమాధవ్ మాట్లాడుతూ, విద్యార్థులు లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలని, ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణతో విజయం సాధించవచ్చని ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. తదుపరి ఈ కార్యక్రమంలో కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు, సాంస్కృతిక, క్రీడా మరియు వివిధ పోటీల విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



