Social 1080×1350 • Multi-page
11-09-2026 BREAKING NEWS 08:49 PM
swarnodayam.com
Telugu Daily News

కొనసాగుతున్న ఎస్జిఎఫ్ మండల స్థాయి క్రీడలు

కొనసాగుతున్న ఎస్జిఎఫ్ మండల స్థాయి క్రీడలు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలంలోని విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు జరుగుతున్న మండల స్థాయి ఎస్.జి.ఎఫ్ క్రీడలు శుక్రవారం రెండో రోజు కొనసాగాయి.

రెండవ రోజు ఎస్ జీఎఫ్ఐ మండల స్థాయి ఆటల పోటీలు కబడ్డీ తదితర ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో హుజురాబాద్ మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుండి బాల బాలికలు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, రిటైర్డ్ ఎంఈఓ ఈ వీరస్వామి, ఎస్జీఎఫ్ కార్యదర్శి చిరుత శ్రీనివాస్, రిటైర్డ్ పిడి సొల్లు సారయ్య, వెంకట్ రెడ్డి, అంజయ్య, భాగ్యలక్ష్మి, రేణుక, పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!