రెండో విడత దళిత బందు నిధులు వెంటనే మంజూరు చేయాలి. – తెలంగాణ రక్షణ సేన నాయకుడు బండి అశోక్ కుమార్. – శిబిరాన్ని సందర్శించిన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్12:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రక్షణ సేన నాయకుడు బండి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నవల అర్పించారు. అనంతరం రెండవ విడత దళిత బంద్ రిలే దీక్షలు. శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ… రెండవ విడత దళిత బంధు నిధులను లబ్ధిదారులకు మంజూరు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని ఆయన హెచ్చరించారు.


హుజురాబాద్ నుండే దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం
హుజురాబాద్ లోనే ప్రారంభించారు. నియోజకవర్గ లబ్ధిదారులకు మొండిచేయి చూపించారని ఆవేద వ్యక్తం చేశారు. దలితా బంధు అసలే రాని వాళ్ళకు కూడా దళిత బంధు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. దళితుల ఓట్లతో ఎమ్మెల్యే గెలిచిన వారి కౌశిక్ రెడ్డి దళితుల పట్ల కపట ప్రేమ వలకబోస్తున్నారని అన్నారు. దళితులపై ఎమ్మెల్యే కౌశివరెడ్డికి ప్రేమ ఉంటే వెంటనే దీక్ష శుభ్రం వద్దకు వచ్చి మాకు మద్దతుగా నిలవాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వలితల ప్రణవ బాబు ప్రెస్ మీట్ లో దళితులకు రెండో విడత అకౌంట్లో పడ్డ అమౌంటు ఎటు వెళ్లలేదని ప్రలోభాలు పలుకుతున్నారే తప్ప వాటిని ఎందుకు లబ్ధిదారులకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ దళితులను మోసం చేయడమే తప్ప వారికి న్యాయం చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులకు దళిత బంధు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు.

అర్హులైన దళిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన దళిత బంధు క్రింద ఆర్ధిక సహాయం చెయ్యాలని హుజురాబాద్ నియోజకవర్గం లో తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు బండ అశోక్ ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష చేపట్టారు ఈరోజు దీక్ష శిబిరాన్ని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ సందర్శించి మాట్లాడుతూ..
దళిత బంధు పథకం రెండో విడత నిధులు ఎప్పుడు చేస్తారో చెప్పాలని హుజురాబాద్ నియోజకవర్గంలో మిగిలిన వారిని గురించి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని మొదటి విడతలో లబ్ధి పొందని వారికి ఇవ్వాలని. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం దళిత బంధు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో సమాధానం చెప్పాలని వారు అన్నారు.
దళిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని చెప్పి ఓట్లు వెయించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోకి వచ్చాక ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన విధంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిరసన దీక్ష చేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం నాయకులను అభినందించారు.

ఈ కార్యక్రమం హుజూరాబాద్ నియోజకవర్గం నాయకులు బుర్ర నటరాజ్, సురేష్, సంతోష్ యాదవ్, దీటి శిరీష రమేష్, జిల్లా నాయకులు యండి సల్మా, జంగ అపర్ణ, దసరి అంజలి, గౌతమి, రంగరవేణి లక్ష్మణ్, రాజకుమార్, శ్రీ రాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, అంబాల హరిష్ తో పాటు 200 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: హుజురాబాద్ పురపాలక సంఘం సానిటరీ విభాగం ఉద్యోగులు, సిబ్బంది.

