Social 1080×1350 • Multi-page
12-09-2026 BREAKING NEWS 09:58 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా హుజురాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు, కౌన్సిలర్ గందే శ్రీనివాస్, సుద్దాల హరిశంకర్ లు మాట్లాడుతూ… పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి నాయకులను తయారు చేయించామని అనంతరం ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. సామాజిక బాధ్యతగా తాము సైతం ఇందులో పాలుపంచుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు నూక శ్రీనివాస్, మాడిశెట్టి వీరన్న, రాజన్న, గోగుల హేమచందర్ తదితరులు పాల్గొన్నారు.


@@ లోకల్ యాడ్స్ @@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: హుజురాబాద్ పురపాలక సంఘం సానిటరీ విభాగం ఉద్యోగులు, సిబ్బంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!