Social 1080×1350 • Multi-page
13-09-2026 BREAKING NEWS 01:20 PM
swarnodayam.com
Telugu Daily News

సౌత్ జోన్ స్విమ్మింగ్ పోటీలకు హుజూరాబాద్ కుర్రాడు “రిమోన్” ఎంపిక!

సౌత్ జోన్ స్విమ్మింగ్ పోటీలకు హుజూరాబాద్ కుర్రాడు “రిమోన్” ఎంపిక!
IMG_20260913_131918

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: తమిళనాడులోని తిరునెల్వేలిలో ఈ నెల 15 నుండి 18 వరకు జరగనున్న సి.బి.ఎస్.ఈ. (CBSE) సౌత్ జోన్ స్విమ్మింగ్ పోటీలకు హుజూరాబాద్‌కు చెందిన ‘రిమోన్’ ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు రిమోన్ సెప్టెంబర్ 12న తన కోచ్‌తో కలిసి వరంగల్ నుండి రైలులో తిరునెల్వేలికి పయనమయ్యాడు.

​అండర్-14 విభాగంలో 50 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో రిమోన్ పోటీ పడనున్నాడు. ఇటీవల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి ఈ సౌత్ జోన్ పోటీలకు అర్హత సాధించాడు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధంతో సి.బి.ఎస్.ఈ.ఈ పోటీలను నిర్వహిస్తోంది.

క్రీడల్లోనూ, చదువులోనూ ఆల్‌రౌండర్:

హన్మకొండ భీమారంలోని ‘స్కిల్ స్ట్రోక్’ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రిమోన్, చదువులో ఎప్పుడూ మొదటి ర్యాంక్‌ సాధిస్తూనే క్రీడల్లోనూ రాణిస్తున్నాడు. హుజూరాబాద్ నిర్వాణ హోటల్ యజమాని చందా గాంధీ మనవడు, చందా మాధవి కుమారుడైన రిమోన్‌కు చిన్నతనం నుంచే ఈతపై ఉన్న ఆసక్తిని గమనించి ఆయన తాత గాంధీ నిత్యం హుజూరాబాద్ క్లబ్ స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లేవారు. స్విమ్మింగ్‌తో పాటు ఫుట్‌బాల్‌లోనూ రిమోన్ మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడు.

​తనను నిరంతరం ప్రోత్సహిస్తున్న తల్లి మాధవి, తాత గాంధీ, మామయ్య అరుణ్ గాంధీతో పాటు కుటుంబ సభ్యులకు రిమోన్ ధన్యవాదాలు తెలిపాడు. సౌత్ జోన్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ…‘రిమోన్‌కు ఆల్ ది బెస్ట్!’

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!