Social 1080×1350 • Multi-page
13-09-2026 BREAKING NEWS 05:41 PM
swarnodayam.com
Telugu Daily News

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ పంజాల మనోజ్ (బంటి)..​ – 21వ వార్డులో విఘ్నేశ్వర మండపం నిర్మాణం.​ – కౌన్సిలర్‌కు ధన్యవాదాలు తెలిపిన వార్డు ప్రజలు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ పంజాల మనోజ్ (బంటి)..​ – 21వ వార్డులో విఘ్నేశ్వర మండపం నిర్మాణం.​ – కౌన్సిలర్‌కు ధన్యవాదాలు తెలిపిన వార్డు ప్రజలు
IMG_20260913_174028

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని హుజూరాబాద్ పట్టణ పరిధిలోని 21వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పంజాల మనోజ్ (బంటి) నిలబెట్టుకున్నారు.

​గత మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, తాను గెలిచిన తర్వాత విగ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి వార్డులో శాశ్వత మండపం నిర్మించాలని స్థానిక ప్రజలు ఆయనను కోరారు. వార్డు ప్రజల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మనోజ్, రానున్న విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల నాటికి తప్పకుండా మండపాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చారు.

​నేడు తన మాట ప్రకారం 21వ వార్డులో విఘ్నేశ్వర మండప నిర్మాణాన్ని పూర్తి చేయించడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్ పంజాల మనోజ్ (బంటి)కి ఈ సందర్భంగా స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో కొల్లూరి మధుకర్, చిదురాల హేమలత, కొత్తకొండ శంకర్, బొల్లు మహేందర్, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, మిల్కూరి రమతో పాటు వార్డు ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!