అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో 5 రోజుల ఉచిత ఈఎన్ టి సర్జరీ మెగా ఆరోగ్య శిబిరం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్, సెప్టెంబర్ 14: ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, వరంగల్ ఆధ్వర్యంలో ప్రముఖ ఈ ఎన్ టి సర్జన్ డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్.MBBS, MS (ENT) సేవలతో 15 సెప్టెంబర్ నుండి 19 సెప్టెంబర్ తేదీలలో ప్రత్యేక ఈ ఎన్ టి సర్జరీ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.
ఈ శిబిరంలో చెవిలో నొప్పి లేదా వినికిడి తగ్గడం, తరచుగా జలుబు లేదా ముక్కు బ్లాక్ అవ్వడం, గొంతు నొప్పి లేదా మింగేటప్పుడు ఇబ్బంది అవడం, తలనొప్పి, సైనసైటిస్, చెవిలో మోగుడు శబ్దం, ముక్కు నుంచి రక్తస్రావం వంటి సమస్యలకు చూసి చికిత్స ఇవ్వబడును అనారోగ్యాలపై నిపుణుల వైద్య పరీక్షలు, సలహాలు మరియు అవసరమైన చికిత్స అందించబడుతుంది.
ఆరోగ్య శిబిరంలో భాగంగా ఉచిత ఓపి, ఎండోస్కోపి పరీక్ష,వినికిడి పరీక్ష, థైరాయిడ్ పరీక్ష,మరియు రక్త పరీక్షల పైన 50% డిస్కౌంట్ ఇవ్వబడును.
ఈ శిబిరం 15 సెప్టెంబర్ నుండి19 సెప్టెంబర్ తేదీలలో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, కొత్తపేట క్రాస్ రోడ్, ఆరెపల్లి, వరంగల్ లో నిర్వహించబడుతుంది.
ప్రజలందరూ ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది.
అపాయింట్‌మెంట్ & వివరాలకు: 📞 94598 75555.

