Social 1080×1350 • Multi-page
13-09-2026 BREAKING NEWS 07:26 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ మల్లికార్జున యువజన సంఘానికి వార్డు సభ్యురాలు సౌండ్ సిస్టమ్ వితరణ

శ్రీ మల్లికార్జున యువజన సంఘానికి వార్డు సభ్యురాలు సౌండ్ సిస్టమ్ వితరణ
IMG-20260913-WA0065

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి చెల్పూర్ (కురుమపల్లె) హుజురాబాద్: వినాయక చతుర్థి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చెల్పూర్ (కురుమపల్లె) 5వ వార్డు సభ్యురాలు కంకల భాగ్యలక్ష్మి – కుమారస్వామి దంపతులు శ్రీ మల్లికార్జున యువజన సంఘానికి ఉదారంగా సౌండ్ సిస్టమ్‌ను వితరణ చేశారు.
రూ. 50,000 విలువైన ఈ సౌండ్ సిస్టమ్‌ను వినాయక చవితి పండుగ సందర్భంగా యువజన సంఘం సభ్యులకు వారు ప్రేమతో అందజేశారు. దేవుని సేవలో భాగస్వామ్యం కావడం, గ్రామ యువతను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
​గ్రామ ఉత్సవాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడే సౌండ్ సిస్టమ్‌ను అందించినందుకు వార్డు సభ్యురాలు భాగ్యలక్ష్మి – కుమారస్వామి దంపతులకు శ్రీ మల్లికార్జున యువజన సంఘం ప్రతినిధులు, సభ్యులు ఆ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!