దీపావళి నాటికి వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్ వైద్య సేవలు అందుబాటులోకి. -12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు.. -వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

—సీజీహెచ్‌ఎస్ అదనపు డీజీతో కలిసి ప్రతిపాదిత భవనాలను పరిశీలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
—వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య చొరవతో వేగంగా వెల్ నెస్ సెంటర్ పనులు
స్వర్ణోదయం ప్రతినిధి, హనుమకొండ: వరంగల్ నగరంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు ప్రక్రియ వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య చేసిన నిరంతర కృషికి అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా సోమవారం CGHS, కేంద్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ పర్వీన్ బాలా, CGHS వైద్య బృందంతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేయూ క్రాస్ సమీపంలోని ఆకాశవాణి రేడియో స్టేషన్ ప్రాంగణంలోని ప్రతిపాదిత భవనాలను పరిశీలించారు. వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు అనువైన వసతులు, భవన పరిస్థితి, అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన ఆర్థిక అనుమతి కోసం కేంద్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తించిన ఎంపీ, ఇటీవల మరోసారి ఢీల్లీలో కేంద్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అనుమతిని త్వరితగతిన మంజూరు చేసి, మిగిలిన ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే నేడు కేంద్ర బృందం తో కలిసి ఎంపీ వెల్ నెస్ సెంటర్ ను సందర్శించడం జరిగింది.

దీపావళి నాటికి సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్ వైద్య సేవలు అందుబాటులోకి
తాజాగా అధికారుల బృందంతో కలిసి భవనాలను పరిశీలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, దీపావళి నాటికి CGHS వెల్‌నెస్ సెంటర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అవసరమైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు తన ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ తెలిపారు.

కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు లక్ష్యం
వరంగల్‌లో ఏర్పాటు కానున్న CGHS వెల్‌నెస్ సెంటర్‌ను కేవలం ప్రాథమిక వైద్య సేవలకు పరిమితం కాకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే విధంగా అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.
ఇక్కడ ఓపీ సేవలతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు, వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలకు సంబంధించి రిఫరల్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే మెడికవర్, రెనోవా ఆసుపత్రులతో ఎంప్యానల్‌మెంట్/అనుబంధ ప్రక్రియ ఉన్నట్లు తెలిపారు. తద్వారా వరంగల్, హనుమకొండతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి ఆధారిత కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ నేరెళ్ల మహేందర్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ (డిసిసి) అధికార ప్రతినిధి హుజురాబాద్ (చెల్పూర్).

