Social 1080×1350 • Multi-page
14-09-2026 BREAKING NEWS 08:30 PM
swarnodayam.com
Telugu Daily News

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్
IMG-20260914-WA0126

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహా గణపతి స్వామివారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకోవడం మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని తెలిపారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పవిత్ర సంప్రదాయం, భక్తి పరంపర భవిష్యత్ తరాలకు కూడా అందేలా కొనసాగాలని ఆకాంక్షించారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజు గారికి, నిర్వాహకులకు మరియు భక్తులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన విలువలు, మానవ సంబంధాలు, విశ్వాసాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

గణపతి మండపాల ద్వారా భక్తి, ఐక్యత, సామాజిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు.

వినాయకుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పల్లెలు సిరిసంపదలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించి, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటుగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


## లోకల్ యాడ్స్ ##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ నేరెళ్ల మహేందర్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ (డిసిసి) అధికార ప్రతినిధి హుజురాబాద్ (చెల్పూర్)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!