కరీంనగర్ ఉద్యమ నిప్పు, సామాజిక పోరాట యోధుడు : గుంజపడుగు హరిప్రసాద్ ప్రస్థానం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఒక వైపు ప్రజలకు సేవ చేయాలనే తపన, మరొక వైపు సొంత నేల స్వేచ్ఛ కోసం సాగించిన ఉద్యమ పోరాటం, ఇంకోవైపు తన కుల, బహుజన వర్గాల హక్కులకై విరమించని సమరం… ఇదీ కరీంనగర్ జిల్లా రాజకీయ, సామాజిక వేదికలపై తనదైన ముద్ర వేసిన నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్ ప్రస్థానం.
అడుగులు పడింది ఇక్కడే… (రాజకీయ తొలి అడుగులు)
హరిప్రసాద్ గారి రాజకీయ ప్రయాణం 2005లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) సీతారంపూర్ గ్రామ ప్రధాన కార్యదర్శిగా ప్రారంభమైంది. ఆయనలోని కార్యదక్షత, నాయకత్వ లక్షణాలను గుర్తించిన పార్టీ 2006లో కరీంనగర్ మండల పార్టీ కార్యవర్గ సభ్యుడిగా, 2007 నాటికి మండల అధికార ప్రతినిధిగా పదోన్నతి కల్పించింది.
సామాజిక సేవే ఊపిరిగా… (చిరంజీవి యువత దళపతి)
రాజకీయాలతో పాటు సామాజిక సేవను తన జీవన విధానంగా మలుచుకున్నారు. 2006లో ‘చిరంజీవి యువత’ కరీంనగర్ నియోజకవర్గ సభ్యుడిగా, నగర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కేవలం అభిమానాన్ని చూపించడమే కాకుండా, సామాజిక బాధ్యతగా మలచి దాదాపు 350 మందితో రక్తదానం చేయించారు. అంతేకాకుండా, 50 మందితో నేత్రదాన సమ్మతి పత్రాలను స్వచ్ఛందంగా సేకరించి చిరంజీవి యువత కార్యాలయానికి అందించి తన సేవా నిబద్ధతను చాటుకున్నారు.
ఉద్యమ బాటలో… (ప్రజారాజ్యం నుండి తెలంగాణ ఉద్యమం వరకు)
2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో టిడిపికి రాజీనామా చేసి, పిఆర్‌పి కరీంనగర్ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అయితే, మలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో సమైక్యాంధ్ర నినాదానికి వ్యతిరేకంగా, స్వరాష్ట్ర కాంక్షతో 2009 డిసెంబర్ 29న తన పదవికి, పిఆర్‌పి సభ్యత్వానికి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ గారి సమక్షంలో టిఆర్‌ఎస్ (నేటి బిఆర్‌ఎస్) పార్టీలో చేరి ఉద్యమ పోరాటంలోకి దూకారు.

ఉద్యమ క్షేత్రంలో ఉక్కుపిడికిలి
నిబద్ధత కలిగిన ఉద్యమకారుడిగా కరీంనగర్ తెలంగాణ చౌక్ వేదికగా అనేక ఉద్యమ కార్యక్రమాలను స్వయంగా రూపకల్పన చేసి నిర్వహించారు. రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, రైల్ రోకో, తెలంగాణ బంద్, దీక్షా దివస్ వంటి తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో ముందు వరుసలో నిలిచారు. ఈ పోరాటంలో లాఠీదెబ్బలను తన్నుకొని, పోలీసు కేసులను ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని సైతం అనుభవించారు.
ఉద్యమంలో ఆయన చూపిన చురుకైన పాత్రకు గుర్తింపుగా 2013లో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి కార్యవర్గంలో జిల్లా అధికార ప్రతినిధిగా, జిల్లా పార్టీ మీడియా సెల్ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ గళాన్ని బలంగా వినిపించారు.
కుల సంఘాల ఐక్యత – నాయీబ్రాహ్మణుల హక్కుల పోరాటం
నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన హరిప్రసాద్, తన వర్గ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించారు:
- నాయీబ్రాహ్మణ సేవా సంఘం నగర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా సేవలందించారు.
- నాయీబ్రాహ్మణ జేఏసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, సంక్షేమ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ నాయీబ్రాహ్మణ సంఘాలను ఏకం చేస్తూ కరీంనగర్ వేదికగా “తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక”ను స్థాపించి, వ్యవస్థాపక రాష్ట్ర కన్వీనర్ బాధ్యతలు చేపట్టారు.
- ప్రస్తుతం ఈ ఐక్యవేదికకు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ నాయీబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాడుతున్నారు.

బిసి హక్కులు – జాగృతి నుండి తెలంగాణ రక్షణ సేన వరకు
2023 నుండి ‘బిసి కుల సంఘాల ఐక్య వేదిక’ రాష్ట్ర అధ్యక్షుడిగా కల్వకుంట్ల కవితమ్మ నాయకత్వంలో బిసిల సమస్యలపై పోరాటాలు సాగించారు. ఆయన సేవలను గుర్తించి 2025లో కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షుడిగా నియమించారు. జాగృతిని బలోపేతం చేయడంతో పాటు కవితమ్మ నాయకత్వంలో ‘తెలంగాణ రక్షణ సేన’ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు.
కొత్త బాధ్యత – భవిష్యత్ లక్ష్యం
ప్రస్తుతం తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిచే నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కవితమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన పార్టీని శక్తివంచన లేకుండా బలోపేతం చేటిస్తాను. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర ఏ రాజకీయ పార్టీకి తీసిపోని రీతిలో మన పార్టీని అత్యంత బలంగా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు.
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ నేరెళ్ల మహేందర్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ (డిసిసి) అధికార ప్రతినిధి హుజురాబాద్ (చెల్పూర్).

