Social 1080×1350 • Multi-page
15-09-2026 BREAKING NEWS 08:45 PM
swarnodayam.com
Telugu Daily News

హమారా ప్రసాదు దిష్టి బొమ్మ దహనం

హమారా ప్రసాదు దిష్టి బొమ్మ దహనం
IMG-20260915-WA0066

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానపరిచిన హమారా ప్రసాద్ దుశ్చర్యను ఖండిస్తూ మంగళ వారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిల పక్ష నాయకులు నిరసన వ్యక్తం చేసి,ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానపరుస్తూ దళిత ద్రోహి అమరా ప్రసాద్ చేస్తున్న తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని, కల్పిత గాంధీ పుస్తక ఆవిష్కరణను నిలిపివేయాలని అన్నారు. అంబేద్కర్ ని ప్రపంచ జ్ఞానిగా యుఎన్ఓ గుర్తించి లండన్ లో అతని విగ్రహాన్ని ప్రతిష్టించగా హమారా ప్రసాద్ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమని అన్నారు. రాజ్యాంగాన్ని కించపరచడం అంటే భారత ప్రజలను కించపరచడమేనని, ప్రభుత్వం అతనిని అరెస్టు చేయాలని చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి సొల్లు బాబు ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం, బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్, సందేల వెంకన్న, తాళ్లపల్లి రమేష్, టేకుల సాగర్, క్రాంతికుమార్, జంపయ్య, అంబేద్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదెలు కౌన్సిలర్లు బోరగాల మొగిలి ఇల్లందుల సమ్మయ్య స్వేరో నాయకులు ఆకినపళ్లి ప్రవీణ్ కుమార్, గడప రాజు, మిడిదొడ్డి రాజు, తునికి వసంత్, శనిగరం రవి, పిట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


&& లోకల్ యాడ్స్ &&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ నేరెళ్ల మహేందర్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ (డిసిసి) అధికార ప్రతినిధి హుజురాబాద్ (చెల్పూర్).

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!