Social 1080×1350 • Multi-page
16-09-2026 BREAKING NEWS 07:05 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో వైభవంగా SWF 47వ ఆవిర్భావ జెండా ఆవిష్కరణ

హుజురాబాద్‌లో వైభవంగా SWF 47వ ఆవిర్భావ జెండా ఆవిష్కరణ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజూరాబాద్, సెప్టెంబర్ 16: స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ (SWF) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో సంఘం 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వి. రాములు ముఖ్య అతిథిగా హాజరై SWF జెండాను ఆవిష్కరించారు.
​కార్మికుల సంక్షేమం, హక్కుల పోరాటంలో SWF ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు డిపో ముందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి జి. రమేష్, అసిస్టెంట్ సెక్రటరీ బి. రాజబాబు, కార్యవర్గ సభ్యులు జి. సంపత్, బి. వేణులతో పాటు సీనియర్ నాయకులు సిహెచ్. సారయ్య, ఏ.ఆర్. రావు తదితరులు పాల్గొన్నారు.


## లోకల్ యాడ్స్ ##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ రావుల వెంకట్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (కాట్రపల్లి), హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!