Social 1080×1350 • Multi-page
17-09-2026 BREAKING NEWS 05:57 PM
swarnodayam.com
Telugu Daily News

జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పోలేపాక విల్సన్

జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పోలేపాక విల్సన్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పోలేపాక విల్సన్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
​హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రణవ్ చేతుల మీదుగా విల్సన్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాంపూర్, రంగాపూర్ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు విల్సన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

నియామక పత్రం అందజేస్తున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!