పేద విద్యార్థి వైద్య విద్యకు ఆసరా : హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ఉదారత

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, సెప్టెంబర్ 17: ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు ఒక పేద విద్యార్థికి ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.
హుస్నాబాద్‌కు చెందిన కొమ్ముల లక్కీ కమల్ అనే విద్యార్థి పదో తరగతిలో 9.7 GPA, ఇంటర్‌లో 970/1000 మార్కులు సాధించడమే కాకుండా, NEET-UG 2026లో ప్రతిభ చాటి ప్రతిష్టాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీలో (MBBS) సీటు సాధించాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు వైద్య విద్యకు అడ్డంకిగా మారడంతో, విద్యార్థి ‘మాస్’ (MASS) సంస్థను ఆశ్రయించాడు.

విషయం తెలుసుకున్న చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు వెంటనే స్పందించి, MASS సంస్థ ద్వారా రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. “ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత” అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. చైర్‌పర్సన్ అందించిన ఈ సాయం పట్ల విద్యార్థి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

