Social 1080×1350 • Multi-page
17-09-2026 BREAKING NEWS 11:40 PM
swarnodayam.com
Telugu Daily News

సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం. హుజురాబాద్ లో కాంగ్రెస్ నేతల సంబరాలు.

సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం. హుజురాబాద్ లో కాంగ్రెస్ నేతల సంబరాలు.
IMG-20260917-WA0096

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజూరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ ఆక్రమించినట్లు చెబుతున్న 388 ఎకరాల భూమిని 800 దళిత కుటుంబాలకు పంచుతానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించడం పట్ల హుజూరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. 13వ వార్డు కౌన్సిలర్ సందమల్ల పుణ్య-బాబు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు.

Oplus_16908288


​దళితుల భూముల పంపిణీ: కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో దళితులు నడిచిన నేలను బిఆర్‌ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ, ఆ భూమినే దళితులకు పంచుతామన్న సీఎం నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.
​బిఆర్‌ఎస్ వైఖరిపై ధ్వజం: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యాఖ్యలను ఖండించారు. దళితులను చిన్నచూపు చూస్తున్న బిఆర్‌ఎస్ పార్టీకి దళితులంతా ఏకమై గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
​నాయకుల విమర్శలు: దళిత జాతికి జరుగుతున్న అవమానాలపై బిఆర్‌ఎస్ లోని దళిత నాయకులు నోరు విప్పకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేష్, జంగ అనిల్, దుబాసి బాబు, బత్తిని రవీందర్ గౌడ్, మోరే ఉపేందర్, కెఆర్ బిక్షపతి, కొలుగూరి సమ్మయ్య, ఎర్ర వంశీ, గద్దల కార్తీక్, వరుణ్, అన్వేష్, శ్రీకాంత్, ప్రభాకర్, కీర్తన్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!