మారుతీ నగర్ మహాగణపతిని దర్శించుకున్న సీపీ గౌష్ ఆలం, బల్దియా చైర్ పర్సన్ – ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ , సెప్టెంబర్ 18: హుజురాబాద్ పట్టణంలోని మారుతీనగర్ లో ఏర్పాటు చేసిన మహాగణపతిని కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శుక్రవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడు రాకేష్ శర్మ వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందించారు. మహాగణపతిని దర్శించుకున్న సీపీ గౌష్ ఆలంను గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. గణపతి మండపం వద్ద చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిమజ్జనంలో ఎలాంటి అవరోధాలు లేకుండా నిర్వహించాలని సభ్యులకు సూచించారు. పోలీస్ శాఖ వారు అందించే సూచనలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ వీ మాధవి, టౌన్ సీఐ టీ కరుణాకర్, రూరల్ సీఐ వీ శ్రీనివాస్, కౌన్సిలర్ తాళ్లపెల్లి రమేష్, నాయకులు నల్ల సుమన్, నల్ల బాలరాజు నిర్వాహకులు వినయ్, సతీష్, శ్రీనివాస్, శ్రీకాంత్, నరేష్, వరప్రసాద్, నవీన్, రాము, తదితరులు పాల్గొన్నారు.

అలాగే హుజురాబాద్ పట్టణంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బడా గణనాధున్నీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు దర్శించుకున్నారు.
హుజురాబాద్ పట్టణంలో 6వ వార్డులో గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ తాళ్లపల్లి రమేష్, సొల్లు సునీత, గోస్కుల రాజ్ కుమార్, గణేష్ యూత్ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

