Social 1080×1350 • Multi-page
18-09-2026 BREAKING NEWS 11:32 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ పద్మనగర్‌లో ఘనంగా సామూహిక కుంకుమ పూజలు.. – పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

హుజురాబాద్ పద్మనగర్‌లో ఘనంగా సామూహిక కుంకుమ పూజలు.. – పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్
IMG-20260918-WA0076

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని పద్మనగర్‌లో గణేశుడి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మహిళలు సామూహికంగా కుంకుమ పూజ నిర్వహించారు.

అనంతరం గుండెటి మీనాక్షి మరియు కనుకుంట్ల నరసింహులు సంయుక్తంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ రొంటాల సువాసిని మనోజ్ రావ్, బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, 28వ వార్డ్ కౌన్సిలర్ తాళ్లపల్లి రమేష్, 5వ వార్డు కౌన్సిలర్ సొల్లు సునీత బాబు, యువకులు, కమిటీ సభ్యులు, మహిళలు హాజరై పూజల్లో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!