Social 1080×1350 • Multi-page
19-09-2026 BREAKING NEWS 02:39 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో రూ.15 లక్షలతో మురికి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన

హుజురాబాద్‌లో రూ.15 లక్షలతో మురికి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన
IMG_20260919_143716

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 19 : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పురపాలక పరిధిలోని సైదాపూర్ రోడ్డు క్రాస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రూ.15 లక్షల వ్యయంతో చేపడుతున్న మురికి కాలువ (డ్రెయినేజీ) నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, వైస్ చైర్‌పర్సన్ గూడూరి అంజలి మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి అధికారికంగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సుహాసిని మాట్లాడుతూ.. పట్టణంలో మురుగునీటి సమస్య తలెత్తకుండా, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కాలువ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు కొండ ప్రశాంతి, మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, బోరగాల మొగిలి, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!