Social 1080×1350 • Multi-page
19-09-2026 BREAKING NEWS 06:40 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అధిక నిధులు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు కాపాడాలి! -బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అధిక నిధులు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు కాపాడాలి! -బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్
IMG-20260919-WA0074

బాల కార్మికులు లేని సమాజ నిర్మాణానికి అందరం పాటు పడదాం..
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేద్దాం…

16 ఏళ్ల లోపు పిల్లలకు సెల్ ఫోన్ ను నిషేధం చేస్తూ శాసనసభలో చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్న

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రంలో బాల కార్మిక లేని సమాజ నిర్మాణానికి అందరం పాటు ఆయన పిలుపునిచ్చారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దామని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాలు నిర్మూలనకు కంకణ బద్దులు అవుదామని ఆయన అన్నారు 16 ఏళ్ల లోపు పిల్లలకు సెల్ ఫోన్ నిషేధం చేయాలని రాష్ట్ర శాసనసభలో చట్టాన్ని చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన తెలిపారు బాలల హక్కులు పకడిబందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆయన కోరారు. బాలలచే ఎవరైనా పని చేసినట్లయితే టోలి ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం అందించాలని వారు తెలిపారు. బాల్యం చాలా గొప్పదని అన్నారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అందరం కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. బాలల హక్కుల ప్రజావేదిక గత రెండు దశాబ్దాలుగా బాలల హక్కుల కోసం ఎంత గాను రాష్ట్రవ్యాప్తంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 20 నుండి రాష్ట్రవ్యాప్తంగా మా బాలల హక్కుల ప్రజా వేదిక ఆధ్వర్యంలో 16 ఏళ్లలో పిల్లలకు సెల్ ఫోను సామాజిక మధ్యమాలు నిషేదించాలని రాష్ట్ర శాసనసభలో చట్టం చేయాలని కోరుతూ అన్ని జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దానితోపాటు బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బాల కార్మిక లేని సమాజం కోసం అన్ని వర్గాల ప్రజలు ముందడుగు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాల కార్మికులు లేని సమాజం ఏర్పాడాలంటే ముందు బాలకార్మిక వ్యవస్థ నియంత్రణ జరగాలన్నారు. కానీ దురదృష్ట వసాత్తు ఈసంఖ్య పెరుగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దానికోసం విద్యా హక్కు చట్టాన్ని ను పూర్తి స్థాయి లో అమలు చేసినప్పుడే అని ఈవ్యవస్థను నిర్మూలించడానికి ఆస్కారం వుంటుందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు అన్నిప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని ముఖ్యంగా ప్రజలు, స్వచ్చంద సంస్థ లు ముందుకి రావాలన్నారు. అలాంటి వారిని గుర్తించి వసతి గృహాల్లో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. అందుకు బాధ్యతగా ప్రతి పౌరుడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కంకణ బదులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బాలల హక్కుల ప్రజా వేదిక బాలల హక్కుల కోసం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాల్య వివాహ నిర్మూలన కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలం కాబట్టి వసతి గృహాలను విద్యార్థులకు దుప్పట్లు దోమతెరలు ప్రత్యేకమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!