హుజురాబాద్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలు : – ఘనంగా నివాళులర్పించిన పద్మశాలి సమాజ నాయకులు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో క్రాస్ రోడ్ వద్దగల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద హుజురాబాద్ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సమాజ నాయకులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.



అనంతరం పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ అత్యంత కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన సొంత ఇంటిని కూడా త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి అని గుర్తు చేసుకున్నారు. ఉద్యమ వ్యాప్తికి ఆర్థిక వనరులు సమకూర్చడమే కాకుండా, తన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా త్యాగం చేసిన వీరుడని కొనియాడారు. ప్రజా శ్రేయస్సు కొరకు మాట తప్పక, మడమ తిప్పక ఆనాటి నిరంకుశ నవాబులను సైతం గడగడలాడించిన పోరాట యోధుడని బాపూజీ సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సమాజ నాయకులు వేముల యాదగిరి, చిలుకమారి శ్రీనివాస్, చందుపట్ల జనార్ధన్, సబ్బని రాజేందర్, విడపు రాజు, మంచికట్ల వెంకటరాజం, మంచికట్ల కమలాకర్, మండల యాదగిరి, కుడికాల సాయి, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఆడెపు సూర్యం, మార్తా రవీందర్, ఎలిగేటి ఉపేందర్, సంగెం ఐలయ్య, సంగెం సత్యనారాయణ, సంగెం భాస్కర్, సంగెం శ్రీధర్, గాలి సమ్మయ్య, మంద బిక్షపతి, కొండా గణేష్, సంగెం శ్రీనివాస్ (చిక్స్), సంగెం శ్రీనివాస్ (మెడికల్), నల్గొండ కుమార్, వేముల రమేష్ తో పాటు అధిక సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.

