Social 1080×1350 • Multi-page
21-09-2026 BREAKING NEWS 03:54 PM
swarnodayam.com
Telugu Daily News

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి : శ్రీ శ్రీ శ్రీ సంకటనందన్ దాస్ సాధు పిలుపు

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి : శ్రీ శ్రీ శ్రీ సంకటనందన్ దాస్ సాధు పిలుపు
IMG-20260921-WA0146

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజూరాబాద్: గోవును భారత జాతీయ జంతువుగా గుర్తించాలని సాధు సంకటనందన్ దాస్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా హుజూరాబాద్ పట్టణానికి చేరుకున్న ఆయన, స్థానిక పలు వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో గోమాతకు విశిష్ట స్థానం ఉందని, గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ గోరక్షణ, సనాతన ధర్మ ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ (VHP) ప్రతినిధులు, నాయకులు ​కంకణాల రమేష్ రెడ్డి – మండల అధ్యక్షులు, వీహెచ్‌పీ కొమురవెల్లి రాజు – పట్టణ అధ్యక్షులు, వీహెచ్‌పీ నాయకులు
​గుంటి శ్రీనివాస్, ​ఈదులకంటి రవీందర్ రెడ్డి, మంచికట్ల మురళి, ​కందుల శ్రీనివాస్ రెడ్డి, అనుమాండ్ల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
​మండపాల వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని సాధువు ఆశీస్సులు అందుకున్నారు
.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!