Social 1080×1350 • Multi-page
21-09-2026 BREAKING NEWS 10:49 PM
swarnodayam.com
Telugu Daily News

ఆధ్యాత్మిక శోభతో విలసిల్లిన మామిడిపల్లి కుటుంబం నిర్వహించిన ఆధ్యాత్మిక వేడుకలు

ఆధ్యాత్మిక శోభతో విలసిల్లిన మామిడిపల్లి కుటుంబం నిర్వహించిన ఆధ్యాత్మిక వేడుకలు
IMG20260921211012

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్‌ : హుజూరాబాద్‌ పట్టణంలోని మధువాని గార్డెన్స్‌ సమీపంలో మన వాడకట్టు గణేష్ వద్ద మామిడిపెల్లి సాయి-శ్యామల దంపతుల ఏకైక కుమారుడు కార్తికేయ ఆధ్వర్యంలో శివనామ స్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, లింగ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించగా, అనంతరం విచ్చేసిన భక్తులకు భారీ అన్న వితరణ (అన్నదానం) చేపట్టారు.

​ఈ వేడుకలకు ప్రముఖ సామాజిక కార్యకర్త, కౌన్సిలర్‌ వర్ధినేని రవీందర్‌ రావుతో పాటు 6వ వార్డ్ కౌన్సిలర్ బండ సింధుజ, నాయకుడు పొనగంటి శ్రవణ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సేవ నిరతిని చాటుతూ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!