Social 1080×1350 • Multi-page
22-09-2026 BREAKING NEWS 11:53 AM
swarnodayam.com
Telugu Daily News

టీచర్ల పై దాడి చేసిన రౌడీ మూకలను కఠినంగా శిక్షించాలిబాధ్యత వహించి ఏపీ మాజీ సీఎం వైస్ జగన్ బే షరతుగా క్షమాపణలు చెప్పాలి.- ఓసీ జేఏసీ, రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్.

టీచర్ల పై దాడి చేసిన రౌడీ మూకలను కఠినంగా శిక్షించాలిబాధ్యత వహించి ఏపీ మాజీ సీఎం వైస్ జగన్ బే షరతుగా క్షమాపణలు చెప్పాలి.- ఓసీ జేఏసీ, రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఏపీలో విజయవాడలో డీ.ఎస్ సి క్వాలిఫై అయిన ఉపాద్యాయ ఉద్యోగులపై సోమవారం నాడు వైకాపా శ్రేణులు గూండాలతో దాడి చేయించడాన్ని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్రంగా ఖండించారు.
సమాజంలో అత్యున్నత స్థానంలో ఉండే గురువులైన ఉపాధ్యాయులపై రౌడీ మూకలు, గంజాయి బ్లేడ్ బ్యాచ్లు విరుకుచుపడి రాళ్ళతో, కర్రలతో, కోడి గుడ్లతో దాడి చేసి గాయ పరచి భయబ్రాంతులకు గురి చేయడం అమానుషమని, ప్రజా స్వామ్యానికే మాయని మచ్చ అని పోలాడి రామారావు ద్వజమెత్తారు.
దీనికి మాజీ మంత్రి జోగి రమేష్, వైసిపి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాశ్ ల కనుసన్నల్లోనే గుండాలు, రౌడీ షీటర్లు, సంఘవిద్రోహ శక్తులు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు ఈ దారుణానికి ఓడిగట్టారని ఆరోపించారు. నిరుద్యోగ యువత ఏళ్ల తరపడి శ్రమించి అన్ని అర్హ
లతో ఉపాధ్యాయు ఉద్యోగాలు సాధిస్తే వారిపై భౌతిక దాడులకు దిగడం హెయమైన చర్య అని తీవ్రంగా మండిపడ్డారు.

ఈదాడికి నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తక్షణమే రాష్ట్ర ప్రజలకు, ఉపాధ్యాయ ఉద్యోగులకు భేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని రామారావు డిమాండ్ చేశారు. ఒక వేళ క్షమాపణ చెప్పకపోతే తెలుగు ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని, భవిష్యత్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సామాజిక బహిష్కరణ తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.
శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ అన్ని అర్హత లతో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ భౌతిక దాడులు చేసి గాయ పరిచి గౌరవప్రతిష్టలకు భంగం కలిగించి అవమానించి, వేధింపులకు గురిచేసిన నిందుతులను, వారిని ప్రోత్సహించిన రాజకీయ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని పోలాడి డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుతవ్వాన్ని, పోలీస్ ఉన్నతాదికారులకు రామారావు విజ్ఞప్తి చేశారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని వారి భద్రతకు పూర్తి భరోసా కల్పించాలని పోలాడి రామారావు స్పష్టం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!