Social 1080×1350 • Multi-page
22-09-2026 BREAKING NEWS 07:32 PM
swarnodayam.com
Telugu Daily News

గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి.. – చైర్ పర్సన్ సుహాసిని.

గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి.. – చైర్ పర్సన్ సుహాసిని.
IMG-20260922-WA0047

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : నవరాత్రి పూజలు అందుకున్నటువంటి గణనాధుని శోభాయాత్ర సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, శోభాయాత్ర వీక్షించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని స్పష్టం చేశారు

మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. అలాగే ఎల్.నీ.నో వలన ఈ సారి వర్షాభావం తక్కువగా ఉండడంతో నీటి కొరత లేకుండా అధికారులతో మాట్లాడి ట్యాంకర్ల ద్వారా నీటినీ సమకూర్చి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని, రద్దీగా ఉండే కూడలిలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివిధ శాఖల అధికారులతో ఆమె మాట్లాడారు. నిర్వాహకులు మండపాల నుంచి వినాయక విగ్రహాలను తరలించే క్రమంలో ఎలాంటి నష్టం జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


&& లోకల్ యాడ్స్ &&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ గిన్నారపు మహేందర్ గారు, ఉపసర్పంచ్ జూపాక, బి.ఎస్.పి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!