నిరుపేద బాలికకు ఆర్థికంగా చేయూత.. దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్య పరీక్షలకు డబ్బులకు ఇబ్బంది పడుతున్న నిరుపేద బాలికకు హుజురాబాద్ వాకింగ్ చేసే మార్నింగ్ ఫ్రెండ్స్ గ్రూపు ఆర్థికంగా చేయూతనిచ్చి వారి సహృదయతను చాటుకున్నారు. హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన మైస శరణ్య అనే నిరుపేద బాలిక క్యాన్సర్ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతూ వైద్య పరీక్షల నిమిత్తం డబ్బులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఆమె దుస్థితిని కాట్రపల్లికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు కాసగొని కిరణ్ కుమార్ మార్నింగ్ ఫ్రెండ్స్ గ్రూపు తెలియజేయడంతో సామాజిక కార్యకర్త కౌన్సిలర్ వర్ధినేని రవీందర్రావు ఈ విషయాన్ని గ్రూపు సభ్యులకు వివరించడంతో అందరూ ఆమెకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ముందుకు వచ్చి మంగళవారం 26,500 శరణ్య తల్లిదండ్రులకు అందించారు. ఆర్థికంగా చేయూతను అందించిన వారిలో వర్దినేని రవీందర్ రావు 5000, నాగార్జున డైరీ ప్రభాకర్ రావు 5000,
గోలి శ్రీనివాస్ 5000, బండ శ్రీనివాస్ 2000, చింత శ్రీనివాస్ 1000, పాక సతీష్ 1000, ధనవర్ష రాజు 1000, తక్కలపల్లి సంపత్ రావు 1016 లతో పాటు
కళ్యాణం శ్రీనివాస్, కట్కూరి మల్లారెడ్డి,
తోగరు విద్యాసాగర్, చంద్రగిరి ప్రవీణ్, రుద్రారం కుమారస్వామి, గోలి సురేష్, గంజి జవర్ధన్
వేల్పుల రత్నంలు ఆర్థిక సహాయం అందించిన వారిలో ఉన్నారు.
## లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ గిన్నారపు మహేందర్ గారు, ఉపసర్పంచ్ జూపాక, బి.ఎస్.పి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు హుజురాబాద్.

