వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. -ఏసీపీ వి.మాధవి, చైర్ పర్సన్ సుహాసిని

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తొమ్మిది రోజులపాటు పూజలు చేసి చివరి రోజున భక్తులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా జరుపుకోవాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి, చైర్ పర్సన్ రోంటాల సుహాసిని కోరారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో వినాయక మండపాల నిర్వాహకులతో శాంతి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. నిమజ్జన కార్యక్రమాన్ని అధికారులు సూచించిన విధంగా నిర్వాహకులు జరుపుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా పోలీసుల, మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా అందరూ పాటించాలని దీనివల్ల నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. వినాయక నిమజ్జనం కోసం అన్ని శాఖల సమన్వయంతో మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కెనాల్ లో నీరు లేకపోవడం వల్ల మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నిమజ్జన ప్రాంతంలో నీటిని నిలువ చేస్తున్నట్లు చైర్ పర్సన్ సుహాసిని చెప్పారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ బి కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ బి కిషన్, బుర్ర నటరాజ్, కే సుధాకర్ రావు, పలువురు వినాయక మంటపాల నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ గిన్నారపు మహేందర్ గారు, ఉపసర్పంచ్ జూపాక, బి.ఎస్.పి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు హుజురాబాద్.

