Social 1080×1350 • Multi-page
24-09-2026 BREAKING NEWS 04:08 PM
swarnodayam.com
Telugu Daily News

ట్యాంక్ బండ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్ఐ దుర్మరణం

ట్యాంక్ బండ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్ఐ దుర్మరణం
IMG-20260924-WA0045_1

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ క్రేన్ 2 వద్ద గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ కె.వెంకన్న(55)ను గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టి పరారైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఎస్సై వెంకన్నను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. అయితే నిమజ్జన వేడుకలకు విధులు నిర్వహించేందుకు వెళ్లి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి చెందడంతో కొత్తగూడెంలో తీవ్ర విషాదమలుముకుంది.


## లోకల్ యాడ్స్ ##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ ఎండి ఇమ్రాన్ గారు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!