హిందువుల మనోభావాలను దెబ్బతీయటo సరికాదు. – బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు రావుల వేణు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా హిందువులు పవిత్రంగా పూజించే వినాయక విగ్రహాలను జెసిబితో ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు రావుల వేణు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ… తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలను జెసిబితో ప్రజలు చూస్తుండగా ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలు గాయపడ్డాయని ఇది సహించరాని చర్య అన్నారు. విగ్రహాలు మునిగేంత నీటిని కాకతీయ కెనాల్ లో నింపాల్సిన మున్సిపల్ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యంతో వ్యవహరించడమే దీనికి కారణం అని పేర్కొన్నారు. నీరు ఎంత ఉంది… విగ్రహాలు ఎన్ని అన్న విషయం గుర్తించి కెనాల్ లో మరిన్ని ట్యాంకర్ల ద్వారా నీటిని పోయకపోవడం అధికారుల వైఫల్యం అని ఆయన అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బ తగిలే విధంగా వ్యవహరించిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ లు ఈ చర్యకు బాధ్యత వహించి ప్రజలకు, భక్తులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ ఎండి ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, హుజురాబాద్.

