Social 1080×1350 • Multi-page
24-09-2026 BREAKING NEWS 07:10 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన చైర్మన్‌గా నర్ర శ్రీనివాస్ రెడ్డి

హుజురాబాద్ రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన చైర్మన్‌గా నర్ర శ్రీనివాస్ రెడ్డి
IMG_20260924_190504

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం వార్షిక మహాసభ సింగపూర్ రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన చైర్మన్‌గా నర్రా శ్రీనివాస్ రెడ్డిని 15 మంది పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ మహాసభలో తుమ్మనపల్లి, సింగపూర్, మాందాడిపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాలకు చెందిన రైతు సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా కేవీకే ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అలాగే సీఎస్ఏ ప్రతినిధులు, అగ్రికల్చర్ ఏఈఓ సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సంఘం కార్యకలాపాలు, రైతుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వారు వివరించారు. ప్రస్తుతం ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘంలో 752 మంది సభ్యులు ఉన్నారని, సుమారు రూ.30 లక్షల నిధులతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రైతులను సంఘటితం చేసి, వారి వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకరించడం వంటి లక్ష్యాలతో సంఘం ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.


## లోకల్ యాడ్స్ ##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ ఎండి ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!