ఘనంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గురువారం ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరాదేవి మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…. విద్యార్థి దశ నుండి సామాజిక సేవ భావం పెంపొందించుకోవాలని, పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతలపై పోరాటం, నిరక్షరాస్యత ఆర్థిక మోసాలు వంటి అంశాలపై సమాజంలో చైతన్యం కల్పించే కార్యక్రమాల్లో ముందుండేలా ఎన్ఎస్ఎస్ చేస్తుందన్నారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వరూప రాణి మాట్లాడుతూ… మారుతున్న సమాజానికి అనుగుణంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మల్లారెడ్డి, అధ్యాపకులు ఝాన్సీరాణి, రేణుక, సుమలత, స్వప్న, రమ, లింగారెడ్డి, ఓదెలు, నరేందర్, మహిపాల్ రెడ్డి, సిబ్బంది అఖిన్, జహీరా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ ఎండి ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, హుజురాబాద్.

