Social 1080×1350 • Multi-page
24-09-2026 BREAKING NEWS 11:21 PM
swarnodayam.com
Telugu Daily News

సమస్యల పరిష్కారంలో స్పెషల్ ఆఫీసర్లదే కీలక పాత్ర.. – అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించాలి.. -మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్షలో కలెక్టర్ చిత్రా మిశ్రా

సమస్యల పరిష్కారంలో స్పెషల్ ఆఫీసర్లదే కీలక పాత్ర.. – అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించాలి.. -మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్షలో కలెక్టర్ చిత్రా మిశ్రా
IMG_20260924_231551

—పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయించాలి

—విద్య, వైద్యం సహా శాఖల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ

—మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్షలో కలెక్టర్ చిత్రా మిశ్రా

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ , సెప్టెంబర్ 24: మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి సత్వర పరిష్కారం చూపించడంలో స్పెషల్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అర్హులకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

గురువారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని మండల స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యలు, పెండింగ్ పనులు తదితర అంశాలపై సమీక్షించారు.

గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించాలి

మండల స్పెషల్ ఆఫీసర్లు తరచూ గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను కేవలం నివేదికలకు పరిమితం చేయకుండా, వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. మండలాల వారీగా సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించి, వాటిని సత్వరమే పూర్తి చేయించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని సూచించారు.

విద్య, వైద్యం.. అన్ని శాఖలపై పర్యవేక్షణ

మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆస్పత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, రెవెన్యూ సమస్యల పరిష్కారం, ఇతర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లోపాలను గుర్తించి సరిదిద్దాలని సూచించారు.
ప్రతి నెల మండలాల వారీగా అంశాలను సమీక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్లతో ప్రత్యక్ష సమావేశం నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలానికి సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న అంశాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి.శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జల కుమారి, మండల స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


## లోకల్ యాడ్స్ ##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ ఎండి ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!