వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గా నిమ్మటూరి సాయికృష్ణ.. -అధికారికంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన నిమ్మటూరి సాయికృష్ణ చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి అధికారిక ఉత్సవ కమిటీలో మొత్తం 30 మంది కన్వీనర్లకు ప్రభుత్వం స్థానం కల్పించగా, ఈ కమిటీలో నిమ్మటూరి సాయికృష్ణకు స్థానం కల్పించడంపై పట్టణానికి చెందిన ప్రముఖులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలను ఈనెల 26న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేలా కృషి చేస్తానని తెలిపారు.
తననియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, లకు కృతజ్ఞతలు తెలిపారు.
సాయికృష్ణ నియామకం పట్ల హుజురాబాద్ రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కొండపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్, సీనియర్ రజక సంఘం నాయకులు కొలిపాక సారయ్య, కొలిపాక పోచయ్య, కొలిపాక శంకర్, బోరింగ్ వెంకటరాజం, గోపు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, బిజెపి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.

